Follow Social Media Channels
భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ మూడోసారి అధికారంలోకి రానుంది. ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు.
మెజారిటీ మార్క్ దాటటంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు
ఎన్డీఏ కూటమి 292సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. 543సీట్లున్న లోక్ సభ అధికారం చేపట్టాలంటే 272 సీట్లు సాధించాలి. ఎన్టీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు ఈజీ అయింది. మూడోసారి మోడీ 3.0 సర్కార్ మళ్లీ అధికారంలోకి రానుంది. కౌంటింగ్ సమయంలో ఒక దశలో అధికారం సాధించే మెజార్టీపై కాస్త ఆందోళన కలిగింది. అయినా మళ్ళీ కూటమి పుంజుకుంది.
మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రముఖులు ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాత్రమే కాదు బీహార్ జేడీయూ అధినేత నితీష్ కుమార్, కూటమి నేతలతో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి పార్టీలకు అధికారం చేపట్టడానికి కావాల్సిన ఆధిక్యం రావడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు కార్యక్రమం మొదలు పెట్టింది. మెజారిటీ మార్క్ దాటటంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ఎన్డీఏ కూటమి 292సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. 543సీట్లున్న లోక్ సభ అధికారం చేపట్టాలంటే 272 సీట్లు సాధించాలి. ఎన్టీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు ఈజీ అయింది. మూడోసారి మోడీ 3.0 సర్కార్ మళ్లీ అధికారంలోకి రానుంది. కౌంటింగ్ సమయంలో ఒక దశలో అధికారం సాధించే మెజార్టీపై కాస్త ఆందోళన కలిగింది. అయినా మళ్ళీ కూటమి పుంజుకుంది.