Follow Social Media Channels
పద్మ అవార్డులకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు నటుడు చిరంజీవి తదితరులను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది.
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం అని అన్నారు. ‘‘మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు మనందరం ఐక్యంగా ముందుకు సాగాలి. తెలుగు జాతి గర్వించదగ్గ వెంకయ్య నాయుడు భారత రాష్ట్రపతి పదవిని అధిరోహించాలని ఆశిస్తున్నాను’ అని అధికారిక ప్రకటనలో తెలిపారు.
పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. దీంతో పాటు పద్మ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.25 వేల పింఛను ఇస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు.