విధానసౌధ పూర్తిగా ఖాళీ అయిపోయి సిద్దరామయ్య ప్రభుత్వం ఎక్కడికి పోయిందో తెలియడం లేదని, కర్ణాటక సీఎం, మంత్రుల ఆచూకీ కోసం వారెంట్ జారీ చేయాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ వ్యంగంగా అన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మాట్లాడారు.
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన నెల రోజుల్లోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోవుతుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ జోస్యం చెప్పారు. కర్ణాటక చరిత్రలో ఇంత పెద్ద డ్రామాలు చేసిన ప్రభుత్వం మరొకటి రాలేదని, రెండోసారి సీఎం అయిన తర్వాత సిద్దరామయ్య ఆయన పనితనం గాలికి వదిలేసి తన పదవిని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారని, కర్ణాటక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆారోపించారు.
కర్ణాటకలో కరువు తాండవం చేస్తోందని, బాధితులకు ఎటువంటి సహాయం అందించలేదు. ఏ నైతికత పాటించి ఢిల్లీలో సీఎం సిద్దరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలుపుతున్నారని, సీఎం సిద్దరామయ్యతో పాటు మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కర్ణాటక రాష్ట్రానికి ఎంత గ్రాంట్ వచ్చింది? ఎన్డీయే హయాంలో ఎంత గ్రాంట్ వచ్చిందో సీఎం సిద్ధరామయ్య చెప్పాలని బసవరాజ్ బోమ్మయ్ డిమాండ్ చేశారు.
కర్ణాటక రాష్ట్రానికి అన్యాయం చేసింది మన్మోహన్సింగ్, సిద్ధరామయ్యలేనని, యూపీఏ హయాంలో రాష్ట్రాలకు గ్రాంట్ 32% ఉండేదని, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 42% గ్రాంట్ లు పెంచారని, ఫైనాన్స్ కమిషన్కు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది అన్ని రాష్ట్రాలను సందర్శించి పేదరికం, జనాభా మరియు తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించినప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలో ఉందనే విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
కర్ణాటకలో అప్పుడు ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం మన రాష్ట్ర వాస్తవ పరిస్థితిని తెలియజేయడంలో విఫలమైందని, కర్ణాటకకు రావలసిన రాష్ట్ర వాటా 4.7% నుంచి 3.6%కి తగ్గడానికి సిద్ధరామయ్య ప్రత్యక్ష కారణమని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. నరేంద్ర మోదీ హయాంలో ఆయుష్మాన్ భారత్ యోజన కింద రూ 60 లక్షల మందికి వైద్యం అందిందని, ముద్రా యోజన కింద 60 లక్షల మంది యువతకు బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను కర్ణాటకకు అందించింది అనే విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలన మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు.