Follow Social Media Channels
చర్మాన్ని తేమగా ఉంచడం నుంచి చుండ్రు చికిత్స వరకు కలబంద గొప్ప రెమెడీగా పనిచేస్తుంది. కానీ కలబందను తినవచ్చని చాలా మందికి తెలియదు. అలోవెరా జెల్ జ్యూస్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. కలబందలో అలోయిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కేలరీలను కూడా కరిగిస్తుంది. అలోవెరా ఈ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి సరైన ఆహారం, వ్యాయామం రెండూ ముఖ్యమైనవి. కలబంద తీసుకోవడం వల్ల కేలరీలు చాలా సులభంగా బర్న్ అవుతాయి. కానీ సరైన పద్ధతిలో తీసుకోవడం తెలియకపోతే కలబందను వినియోగించడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తాగాలి. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల కలబంద రసం, ఉసిరి రసాన్ని కలుపుకుని, ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తాగాలి. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.