Follow Social Media Channels
పేటీఎం పేమెంట్ బ్యాంక్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2024 ఫిబ్రవరి 29న నుంచి పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై నిషేధాన్ని ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 29న నుంచి పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్తగా కస్టమర్లను ఆన్‌బోర్డింగ్ చేయడం, వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్ లో డిపాజిట్లు, టాప్ అప్ చేయకుండా నిషేధించారు.
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో పేటీఎం కూడా కనుగొనించిన కొన్ని సేవలను అనుమతిస్తారు. వినియోగదారులు వాలెట్లో మిగిలిన బ్యాలెన్స్‌ను వారి సేవింగ్స్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం, బ్యాంకులో మెటీరియల్ పర్యవేక్షణపై ఆందోళనలు తలెత్తడం వలన ఈ నిషేధాన్ని ప్రకటించారు.
దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్‌ను ఆర్బీఐ జనవరి 31న విడుదల చేసింది. పేటీయం వాలెట్ యూజర్లు దీని కారణంగా కాస్త ఇబ్బంది పడనున్నారు. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే 2018లో దాదాపు మూడు కోట్ల మంది పేటీయం ద్వారా చెల్లింపులు జరిపేవారు.
పేటీయం బదులుగా ఏ యాప్‌లు ఉపయోగించాలి? భారతదేశంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేవారికి పేటీయం ఒక పెద్ద ఆప్షన్. పేటీయం ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది చెల్లింపులు చేస్తారు. అటువంటి పరిస్థితిలో పేటీయం పేమెంట్స్ బ్యాంక్ అందించే చాలా ఫీచర్లు నిషేధించిన తర్వాత వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌లను తప్పక ఉపయోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఆన్లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించే కొన్ని ప్రధాన చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల జాబితాను చూద్దాం.
- గూగుల్ పే (Google Pay)
- అమెజాన్ పే (AmazonPay)
- వాట్సాప్ పే (WhatsApp Pay)
- ఫోన్‌పే (PhonePe)
- మొబిక్విక్ (Mobikwik)
- ఫ్రీ ఛార్జ్ (Free Charge)
- జియో మనీ (Jio Money)